ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (11:01 IST)

తెల్లారితే పెళ్లి.. వధువు ఆత్మహత్య.. పెళ్లికి తర్వాత ఉద్యోగం చెయ్యాలన్నాడు..

bride
తెల్లారితే పెళ్లి జరుగుతుందనగా.. వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవళి (22) తెలంగాణలోని నవీపేటకు చెందినది. రెండు కుటుంబాల అంగీకారంతో అథీ ప్రాంతానికి చెందిన సంతోష్ తో ఆమెకు వివాహం  జరగాల్సి వుంది. దీని కోసం, పెళ్లికి ముందు రోజు మెహందీ వేడుకను నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి  ఇరు కుటుంబాల బంధువులు కూడా హాజరయ్యారు. ఉదయం పెళ్లి జరుగనుండటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో పెళ్లికొడుకు సంతోష్ వధువు రవళితో మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 
పెళ్లికి తర్వాత కూడా ఉద్యోగం చెయ్యాలని.. పెళ్లి తర్వాత ఆస్తిని పంచుకోవాలని వధువుతో అన్నాడు. ఈ వ్యవహారంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన వధువు రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో వరుడి కుటుంబంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రవళి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.