Festival Posters

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు: ఏ1 నిందితుడు అరెస్టు

Written By ఠాగూర్
Updated: గురువారం, 7 జనవరి 2021 (08:26 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసును ఆ రాష్ట్ర పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఈ కిడ్నాప్ బోయిన్‌పల్లిలో జరిగింది. ఈ కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. 
 
అయితే, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఏ1గా ఎందుకు చేర్చారో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ప్రవీణ్‌తో విభేదాలు వచ్చినవి వాస్తవమే అన్న సుబ్బారెడ్డి.. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన పేరు తెర మీదకొచ్చిందన్నారు. 
 
గతంలో తనను చంపడానికి సుపారీ ఇచ్చిన అఖిల ప్రియతో తానెందుకు కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తానని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. హఫీజ్‌పేట వ్యవహారంలోనే కిడ్నాప్ చేశారా లేక వ్యక్తిగత కారణాలతోనే కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడుతాయన్నారు. 
 
అయినప్పటికీ, పోలీసులు సుబ్బారెడ్డిని ఏ1గానే పరిగణించి అరెస్ట్ చేయడంతో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కాగా, ఇదే కేసులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 
 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments