శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (12:41 IST)

బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

road accident
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బుధవారం బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు రాజీవ్ గాంధీ నగర్‌లో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
వరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బస్సు పాదచారులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. 
 
బాధితులను కిందపడేసి బస్సు డ్రైవర్‌ వాహనాన్ని ఆపలేదు. బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను రాజవ్వ, లచ్చవ్వగా గుర్తించారు.