ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (13:47 IST)

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్‌‍లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు చెప్పినట్టుగా ఆరోగ్య సూత్రాలు పాటించి, కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కాగా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వైరస్ సోకినట్టు చిరంజీవి తాజాగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే, మరో హీరో శ్రీకాంత్ కూడా ఈ వైరస్ బారినపడ్డారు.