సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (08:38 IST)

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం - కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

road accident
హైదరాబాద్ నగరంలో కారు ప్రమాదం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సత్తంరాయిలో గత రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
బాధితురాలు స్థానిక విమానాశ్రయం నుండి ఇంటికి వెళుతుండగా ఈ విషాదం జరిగింది కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
 
సమాచారం విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.