1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మే 2022 (08:17 IST)

అప్పుల బాధతో కుమార్తెలతో కలిసి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో విషాదం ఘటన ఒకటి సంభవించింది. అప్పుల బాధను తాళలేక తమ ఇద్దరి కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరధిలోని కుర్మల్ గూడ చెరువులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుర్మల్ గూడ చెరువు ప్రాంతానికి చెందిన దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో పురుగుల మందు సేవించి చెరువులో దూకినట్టు సమాచారం. దీంతో మంగళవార ఉదయానికి తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు చెరువు గట్టున తేలాయి. 
 
మరో మహిళ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులను మలక్‌పేటకు చెందిన కుద్దూర్, ఫిర్దోస్, మెహక్ బేగంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇద్దరు కుమార్తెలతో ఓ దంపతుల జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.