Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్‌కు ముందు దంపతుల సెల్ఫీ వీడియో... కారణం ఏంటంటే?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 30 జులై 2021 (19:08 IST)
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కేశవ స్వామిగౌడ్, సంధ్యారాణి అనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పరకాలలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి కేశవస్వామి గౌడ్, సంధ్యారాణిలు ప్రార్థన కోసం పరకాలలోని ఓ చర్చీకి వెళ్లి అక్కడే పురుగులు మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వారిని పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు.
 
అయితే ఆత్మహత్యకు ముందు మృతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమను కొంతమంది వ్యక్తులు మోసం చేశారని సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.12 లక్షల వసూలు చేశారని ఆరోపించారు. సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments