బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 నవంబరు 2021 (20:15 IST)

హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్, విలువ రూ. 5.5 కోట్లు

హైదరాబాదులో పలువురు ఇళ్లలోనే గంజాయి చెట్లను ఇటీవల కలకలం సృష్టించింది. ఇదిలావుంటే తాజాగా మరో భారీ కుదుపు వెలుగుచూసింది. భాగ్యనగరం నుంచి భారీగా డ్రగ్స్ ఎగుమతి అవుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఫోటో ఫ్రేముల వెనుక డ్రగ్స్ పార్సిల్స్ ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసి పెట్టి ఆస్ట్రేలియాకు పంపుతున్నారు.

 
పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా సుమారు 14 కిలోల డ్రగ్స్ బయటపడింది. దీని విలువ సుమారు రూ. 5.5 కోట్లు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈమధ్య కాలంలో వందల కిలోలు డ్రగ్స్ వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గంజాయి చెట్లను ఇళ్లలో పెంచడాన్ని చూస్తుంటే డ్రగ్స్ వ్యవహారం బాగా ముదురుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.