శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (13:26 IST)

రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత : రైతు చేయి విరగ్గొట్టిన పోలీసులు

రాజధాని అమరావతి ప్రాంత పరిరక్షణ కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 
 
ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయివిరిగింది. ప్రశాంతంగా సాగుతున్న మహా పాదయాత్ర రైతులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా లాఠీచార్జ్‌లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే గ్రామాల ప్రజలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
 
అయినప్పటికీ మొక్కవోని సంకల్పంతో పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులిపోతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా న్యాయస్థానం టు దేవస్థానం వరకు ఈ పాదయాత్రను చేసి తీరుతామని రైతులు ప్రకటించారు.