గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (07:34 IST)

భయపెడుతున్న జోకర్ సాఫ్ట్‌వేర్

జోకర్ సాఫ్ట్‌వేర్ భయపెడుతోంది. జోకర్ సాఫ్ట్‌వేర్‌తో యువత తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసింది. మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్‌వేర్  ఇప్పటికే కుదిపేస్తోంది.
 
 ఫోన్లు, డెస్క్‌టాప్‌లో ప్రత్యక్షమవుతోంది. జోకర్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి వ్యక్తిగత సమాచారం వెళ్తుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. 
 
బ్యాంకు డిటైల్స్‌ నుంచి వ్యక్తిగత ఫొటోల వరకు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని ఆయన చెబుతున్నారు. జోకర్ సాఫ్ట్‌వేర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని అంజనీకుమార్ సూచించారు
 
సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.క్రిడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంక్ ఖాతాలో సొమ్మును ఎత్తుకుపోతున్నారు. సైబర్ నేరగాళ్లు సైబర్ క్షేత్రాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.