బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (16:40 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ

Jobs
తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తొలి విడతలో భాగంగా ఇప్ప‌టికే 80వేల పైచిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వగా, తాజాగా రెండో విడ‌త‌లో భాగంగా బుధ‌వారం మ‌రో 3వేల 334 ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
రెండో విడ‌త‌లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వాటిలో ఎక్సైజ్‌, ఫారెస్ట్‌, అగ్నిమాప‌క శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చిన ఆర్థిక శాఖ‌.. మిగిలిన శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన అనుమ‌తుల‌పై దృష్టి సారించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి ల‌భించిన ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్లు జారీ కానున్నాయి.