Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ వద్ద ఆర్టీసీ విలీన బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 6 ఆగస్టు 2023 (12:18 IST)
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ప్రస్తుతం గవర్నర్ టైబుల్‌పై ఉంది. ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేస్తారా? లేదా? అన్న అంశంపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియను అడ్డుపడాలనే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టంచేశారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలన్నదే తమ అభిమతమన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగ అంశమన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్‌భవన్‌కు రాలేదన్నారు. 
 
ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్నారు. అయితే, తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న సీఎస్ వివరణ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా సాగాలాన్నారు. ఉద్యోగులు ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తి స్థాయిలో పరిష్కరించేదిగా ఉందా? లేదా? అన్నదే ముఖ్యమన్నారు. 

అన్నీ చూడండి

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

Kamal Haasan: కమల్ హాసన్ లుక్ టెస్ట్‌ పూర్తి - త్వరలో షూటింగ్

తర్వాతి కథనం
Show comments