మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (09:30 IST)

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు మాతృవియోగం

తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఆమె వయసు 80 యేళ్లు. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. 
 
అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో కృష్ణకుమారి భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. 
 
కృష్ణకుమారి... మాజీ ఎంపి కుమారి నందన్ భార్య. తమిళిసై కృష్ణకుమారికి పెద్దకూతురు. గవర్నర్ తల్లి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.