బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

rain
ఉత్తర భారతం నుంచి తిరోగమన దారిలో పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంపై చురుగ్గా కదులుతున్నాయి. దీనికితోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ముఖ్యంగా, బుధవారం మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాది, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పాలమూరు, వరంగల్, వన్మకొండ, ఆసిఫాబాద్, జనగాం, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.