Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి: భారీగా నాటుకోళ్లు మృత్యువాత

Written By సెల్వి
Updated: బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:11 IST)
కరీంనగర్‌ జిల్లాలో వింత వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో భారీగా నాటుకోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కళేబరాలను గ్రామశివారులో పూడ్చి పెట్టాడు యజమాని. కోళ్ల మృతితో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కోళ్ల మృతికి గల కారణాలను అన్వేషించాలని కోరాడు. 
 
అయితే.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. బర్డ్‌ ఫ్లూ అంటూ భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు చనిపోయిన కోళ్లను పరిశీలించిన పశు వైద్యాధికారులు.. బర్డ్‌ ఫ్లూ కాదని చెబుతున్నారు.
 
వికారాబాద్‌ జిల్లాలోనూ ఇదే ఘటన వెలుగుచూసింది. దారూర్‌ మండలం దోర్నాల్‌లో గత 4 రోజులుగా వందల సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లు, కాకుల మృతిపై పశుసంవర్ధకశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అన్నీ చూడండి

చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే నాకు క్రష్ : నటి ఆనంది

Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూ

Suriya: వీడియో గేమ్ కాన్సెప్ట్ తో సీన్ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్‌ పై సాంగ్

Rahul Sankrityan: తను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు.. అతనే రణబాలి : రాహుల్ సంకృత్యన్

Vijay Deverakonda: రశ్మిక రానందుకు సారీ - నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు వారి జీవితాలు మార్చుకోండి : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments