శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (18:45 IST)

తెలంగాణ మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఆయన వెంట చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి ఈ ఆసుపత్రి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
 
అయితే ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత మంత్రి హరీష్ రావు, వచ్చిన ముఖ్య అతిథులంతా వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత ఆసుపత్రిలో పెను ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో అమర్చిన లిఫ్టు వైర్లు తెగిపోయి కుప్పకూలింది. 
 
లిఫ్టులో ఎక్కువమంది ఎక్కడం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో కొంతమందికి స్వల్ప గాయాలు తగినట్టు సమాచారం. ఇక ఘటన తెలిసిన మంత్రి హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు.