గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (12:40 IST)

డబ్బు చాలక భర్త దుబాయ్‌కి, కోర్కె తీరక భార్య మరిదితో ఎంజాయ్

ఆమెకు పెళ్ళయి ముగ్గురు పిల్లలున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భర్త దుబాయ్‌కు వెళ్ళాడు. సంపాదించి భార్య, ముగ్గురు పిల్లలకు పంపిస్తున్నాడు. అయితే భార్య మాత్రం ఉన్న ప్రాంతంలోనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. భర్తకు ఈ విషయం తెలిసి విడాకులు ఇచ్చేస్తే మరొక పెళ్ళి చేసుకుంది. కానీ ఆమెలో మార్పు కనిపించలేదు. ప్రియుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు నిండు జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంది.
 
కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలోని వెంగళాపూర్‌కు చెందిన షేక్ మొమీనకు 15 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మేస్త్రీగా పనిచేస్తున్న షేక్ మొమీన భర్తకు వచ్చే డబ్బులు ఇంటి ఖర్చులు సరిపోలేదు. దీంతో దుబాయ్‌కు వెళ్ళాడు. అక్కడ నుంచే డబ్బులు బాగా సంపాదించి భార్యకు పంపిస్తున్నాడు.  
 
కానీ భర్త లేని విరహాన్ని తట్టుకోలేని భార్య మరిది ఖదీర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది కాస్త భర్తకు ఆలస్యంగా తెలిసింది. భార్యకు విడాకులు ఇచ్చేశాడు భర్త. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా మరిది ఖదీర్‌ను మాత్రం వదిలిపెట్టలేదు. అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
 
అయితే దీన్ని ఏ మాత్రం ఒప్పుకోని మొమీన తల్లిదండ్రులు ఆమెకు మరో పెళ్ళి చేశారు. ఇలియాస్ అనే పెళ్ళయి విడాకులు ఇచ్చిన వ్యక్తితో రెండవ పెళ్ళి చేశారు. వీరిద్దరు వేరు కాపురం పెట్టారు. ఇలియాస్‌కు పెళ్ళయినా పిల్లలను మాత్రం భార్య పుట్టింటికి తీసుకెళ్ళిపోయింది.
 
దీంతో మొమీన పిల్లలను తన పిల్లలుగా భావించి ఇద్దరూ కలిసి ఉండేవారు. అయితే మొమీనలో మాత్రం మార్పు రాలేదు. మరిది ఖదీర్‌తో ఆ సంబంధాన్ని కొనసాగించింది. అదీ చాలక ఖదీర్ స్నేహితుడు ఆసీఫ్‌తోను శారీరక బంధాన్ని పెట్టుకుంది. ఈ విషయాలు రెండవ భర్తకు తెలిసింది. 
 
ఇలియాస్‌ చాలాసార్లు మందలించాడు. అయినా ఆమె మారలేదు. ఇంటి నుంచి మొమీనను బయటకు పంపలేదు ఇలియాస్. దీంతో మొదటి భర్త తమ్ముడు మొమీన మరిది ఖదీర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇలియాస్‌ను చంపేస్తే తన శారీరక సుఖానికి ఎలాంటి అడ్డు ఉండదని భావించారు. మొమీన సహాయంతో నిద్రపోతున్న ఇలియాస్‌ను అతి దారుణంగా ఊపిరాడకుండా చంపేసి.. ఆ తరువాత ఉరి తీసేశారు.
 
ఆర్థిక ఇబ్బందులతోనే ఇలియాస్ ఉరి వేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడి ఇద్దరు నిందితులు కటాకటాల పాలయ్యారు. మొమీన జైలుకు వెళ్ళడం.. ఇలియాస్ చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.