శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (14:42 IST)

అన్నం పెట్టనన్నందుకు భార్యను అంతం చేసిన భర్త

ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని మీర్ పేటలో దారుణం జరిగింది.
 
తనకు అన్నం పెట్టమని అడగ్గానే పెట్టలేదన్న కోపంతో ఓ భర్త ఆమె గొంతు నులిమి చంపేశాడు. వివరాల్లోకి వెళితే... మీర్ పేట పరిధిలో 40 ఏళ్ల జయమ్మ భర్త శ్రీనివాస్, కుమారుడితో కలిసి వుంటోంది. నిన్న రాత్రి ఆమె కుమారుడిని తీసుకుని బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చింది.
 
ఇంటికి వచ్చిన భార్యను తనకు అన్నం పెట్టాలంటే అడిగాడు భర్త. ఐతే ఆ సమయంలో అన్నం వండేందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహం చెందిన భర్త భార్య చీరను లాగి ఆమె గొంతుకి బిగించి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.