శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (20:13 IST)

నిండు గర్భిణి నోట్లో యాసిడ్ పోసిన భర్త.. ఎక్కడంటే?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తన భార్య పట్ల భర్త దారుణంగా ప్రవర్తించాడు. గర్భంతో వుందని కనికరం లేకుండా కిరాతకుడిగా మారాడు. తండ్రి, బావమరిదితో మర్డర్‌ ప్లాన్‌ వేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం భార్య నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్ పోశారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లాలోని మల్కాపూర్‌ తండాకు చెందిన కళ్యాణికి రాజిపేటకు చెందిన తరుణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. ఈ ఇద్దరూ ఓ ఏడాది మంచిగా కాపురం చేశారు. ఆ తర్వాతి నుంచి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.
 
ఈ నరకంలోనూ తల్లి కాబోతున్నానన్న వార్త ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భర్త బాధించినా.. పుట్టబోయే బిడ్డకోసం బతకాలనుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. 
 
అంతే హత్యకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా కళ్యాణి నోట్లో బలవంతంగా ఎలుకల మందు కలిపిన యాసిడ్‌ పోశారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది. మృతురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.