మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (09:47 IST)

హైదరాబాదులో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్

Rains
హైదరాబాదులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వేసవితో అల్లాడిన ప్రజలను వరుణుడు పలకరించాడు. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఏర్పడింది. 
 
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 
 
అంతేగాకుండా హైదరాబాదు నగరంలో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఏపీలోనూ శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.