గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (17:09 IST)

తెలంగాణాలో మరో నాలుగు రోజులు వడగళ్ళ వర్షం...

Rains
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇందులోభాగంగా, శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. 
 
శని, ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్, కొమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. అటు హైదరాబాద్ మహానగరంలోనూ భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.