బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (19:28 IST)

ఏ ఎమ్మెల్యే ఎంత తీసుకుంటున్నారో నాకు తెలుసు : సీఎం కేసీఆర్

cmkcr
సొంత పార్టీ ఎమ్మెల్యేలకు భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ ఎమ్మెల్యే ఎంత తీసుకుంటున్నారో నాకు బాగా తెలుసంటూ వ్యాఖ్యానించి శాసనసభ్యుల నెత్తిన పిడుగు వేశారు. పైగా, వచ్చే ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. పైగా అసెంబ్లీ ఎన్నికలలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. అందువల్ల ముందస్తుగా ఎన్నికలకు వెళ్లేది లేదని ఆయన చెప్పకనే చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు వచ్చాయని, ఈ దఫా 100 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజా ప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమంపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలని ఆయన కోరారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని సీఎం కేసీఆర్ కర్తవ్య బోధ చేశారు. సరిగా పని చేయని ఎమ్మెల్యేలను ఉపేక్షిస్తానని అనుకోవద్దంటూ హెచ్చరిక చేశారు. మళ్లీ అధికారంలోకి రావడం ప్రాధాన్యతా అంశం కాదనీ, గతంలో కంటే అధిక సీట్లు రావడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జరిగిన పార్టీ  సర్వసభ్య సమావేశంలో చెప్పారు.