బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (08:26 IST)

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. రూ.59కే రోజంతా జర్నీ

హైదరాబాద్ నగరంలోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ మెట్రో హాలిడే పేరుతో ఓ జర్నీ కార్డును హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది అన్ని సెలవులతో సహా 100 రోజుల పాటు 27 స్టేషన్‌లు, మూడు కారిడార్‌లలో అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది. 
 
ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిబి రెడ్డి ఈ కార్డును ప్రారంభించారు. కార్డ్ ఏప్రిల్ 2 నుండి అందుబాటులో వస్తుందని తెలిపారు. రైలు టిక్కెట్ కౌంటర్‌లో లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సెలవుల జాబితాను యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. 
 
ప్రయాణీకులు సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ని ఏదైనా టిక్కెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్డు ధర రూ.50 (వాపసు చేయబడదు), ఆ తర్వాత రూ.59కి రిచార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.