హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 40 కార్లలలో 20 బృందాలుగా విడిపోయిన అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాల భద్రతతో ఈ సోదాలకు జరుపుతున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్ను చెల్లింపుల్లో ఈ కంపెనీ భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. దీనిపై పక్కా సమాచారం సేకరించిన ఐటీ అధికారులు ఈ సోదాలకు దిగారు.
ఆ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లతోపాటు బాచుపల్లి, చందా నగరులోనూ ఏక కాలంలో ఈ సోదాలకు దిగారు. ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోకూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఏకంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోది. గత కొంతకాలంగా ఆదాయపన్ను శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా సోదాలు జరుపుతుండం చర్చనీయాంశంగా మారింది.