శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:03 IST)

పిల్లిగుడిసెలు బస్తీలో పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు

హైదరాబాద్ నగరంలోని మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డబుల్ బెడ్రూమ్ గృహాలను నిర్మించింది. మొత్తం 288 డ‌బుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిచగా, ఈ గృహాలను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ గృహాలను తొమ్మిది బహుళ అంతస్తుల్లో నిర్మించారు. ఇందుకోసం మొత్తం రూ.24.91 కోట్లను ఖర్చు చేశారు. 
 
హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్ల‌మ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో మురికివాడ‌గా ఉన్న పిల్లిగుడిసెలు బ‌స్తీలో ఇప్పుడు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. ఆ ప్రాంతానికి కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కాల‌నీలో కొత్త‌గా సీసీ రోడ్లు వేశారు. తాగునీటి అవ‌స‌రాల కోసం 100 కేఎల్ సామ‌ర్థ్యంతో సంప్‌ను నిర్మించారు. 19 షాపుల‌ను ఏర్పాటు చేశారు.
 
డ‌బుల్ బెడ్రూం గృహాల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీతో పాటు ప‌లువురు పాల్గొన‌నున్నారు.