ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (18:04 IST)

కేటీఆర్ ఫైర్.. దగాకోరు.. రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకోండి

ktrao
బీజేపీ తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? అవి కేటీఆర్ బండి సంజయ్‌ను నిలదీశారు.  
 
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర దగాకోరు యాత్ర అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన బీజేపీ నేతలకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదని కేటీఆర్ అన్నారు. 
 
పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు కేటీఆర్. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నారు మండిపడ్డారు మంత్రి కేటీఆర్.  
 
కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారో ... సమాధానం చెప్పాలి? అని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. తెలంగాణకు బీజేపీ చేసిన మోసానికి మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.