Daily Horoscope
✕

ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం : మంత్రి కేటీఆర్ వ్యంగ్య ట్వీట్

Written By వరుణ్
Updated: బుధవారం, 5 ఏప్రియల్ 2023 (19:26 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో పెరిగిపోయిన ధరలను ప్రధానంగా చేసుకుని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. ప్రియమైన మోడీ అని కాకుండా పిరమైన మోడీ అనాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ చేసిన కవితాత్మక ట్వీట్‌లో ఆయా ధరల పెరుగుదలపై వచ్చిన వార్తల క్లిప్పింగ్స్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్‌పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం...
జనమంతా గరం... గరం... 
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోడీ కాదు.. 
“పిరమైన ప్రధాని.. మోడీ.." అంటూ వ్యాఖ్యానించారు. 

అన్నీ చూడండి

రౌడీ జనార్థన మూవీ నుంచి కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా

Nagavamsi: తెలుగునాట జైలర్ 2 ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌ చిత్రం స్లమ్ డాగ్ షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్

తర్వాతి కథనం
Show comments