తెలంగాణలో 30 వరకు లాక్ డౌన్
తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా తో మాట్లాడుతూ దీనిని స్పష్టం చేశారు.
"ఇది సమాజం, మన పిల్లలు, భవిష్యత్తు సంక్షేమం కోసం కాబట్టి అందరూ సహకరించాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలు సామూహిక కార్యక్రమాలను మానుకోవాలి. మీరు నష్టపోయి, సమాజానికి నష్టం చేయొద్దు " అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాలం కలిసొస్తే ఏప్రిల్ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆలోచిస్తామని తెలిపారు. కేరళ తరహాలో మద్యాన్ని హోం డెలివరీ చేసే యోచన లేదని, రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎవరైనా ధరలు పెంచినా, నిత్యవసర సరుకుల కత్రిమ కొరత సష్టించినా పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు.