Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కరీంనగర్ జిల్లాలో పరువు దాడి... ప్రేమికుడిని చితక బాదారు...

కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఓ బీసీ యువకుడిని అగ్ర వర్ణాలకు చెందిన 25 మంది దాడి చేసి చితక బాదిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కరీంనగర్ టూటౌన్లో కేసు నమోదు చేశారు.

Written By srinivas
Updated: గురువారం, 4 అక్టోబరు 2018 (21:27 IST)
కరీంనగర్ సప్తగిరి కాలనీలో ఓ బీసీ యువకుడిని అగ్ర వర్ణాలకు చెందిన 25 మంది దాడి చేసి చితక బాదిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కరీంనగర్ టూటౌన్లో కేసు నమోదు చేశారు. బాధితుడు సాయి అన్న అజయ్ అందిస్తున్న వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందూర్తికి చెందిన సాయి, ఒగులాపూర్‌కు చెందిన తన క్లాస్‌మేట్‌తో గత నాలుగైదు ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 
 
అయితే ఇద్దరి సామాజికవర్గాలు వేరు కావడంతో ప్రేమ వద్దని చెప్పారు ఇరు కుటుంబాల పెద్దలు. తిరిగి మూడు రోజుల క్రితం అమ్మాయితో సాయి ఫోన్లో మాట్లాడినట్టు తెలుసుకున్న యువతి బంధువులు సప్తగిరి కాలనీలో సాయిని చితకబాది రోడ్డుపై పడేసి వెళ్లారు. ప్రస్తుతం సాయి అక్షయ కాలేజీలో, యువతి శ్రీ చైతన్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. ప్రస్తుతం సాయి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments