బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (11:15 IST)

2 నెలలుగా తల్లీ కుమార్తెలపై 18 మంది కామాంధులు గ్యాంగ్ రేప్..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని కైథాల్ కలాయత్ పట్టణంలో ఓ మహిళ తన 15 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమె తన కుమార్తెను తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లింది. అంతే.. వారిద్దరినీ బంధించి అత్యాచారం చేసిన గ్రామ సర్పంచ్.. ఆ తర్వాత తన స్నేహితులను, మాజీ సర్పంచ్‌ను పిలిచి సామూహిక అత్యాచానికి పాల్పడ్డాడు. 
 
ఇలా గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఆ కామాంధుల వేధింపులు భరించలేని తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి 18 మంది నిందితుల్లో ఏడుగురుని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్ఐ కూడా ఉండటం గమనార్హం. 
 
ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.