బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (09:16 IST)

సోషల్ మీడియా అంత సేఫ్టీ కాదనేందుకు ఇదో ఉదాహరణ..

సోషల్ మీడియా అంత సేఫ్టీ కాదనేందుకు పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ మరోసారి హ్యాకర్ల బారిన పడింది. ఏకంగా ఐదు కోట్ల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని హ

సోషల్ మీడియా అంత సేఫ్టీ కాదనేందుకు పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ మరోసారి హ్యాకర్ల బారిన పడింది. ఏకంగా ఐదు కోట్ల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్లు కాజేశారు. ఈ మేరకు వెబ్‌సైట్ భద్రత వ్యవస్థలోని లోపం సాయంతో హ్యాకర్లు యాక్సెస్ టోకెన్స్‌ను చోరి చేసినట్లు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. మంగళవారం ఈ లోపాన్ని గుర్తించడం జరిగిందని.. గురువారం రాత్రికి ఆ పనిని పూర్తి చేశామని తెలిపారు. 
 
హ్యాకర్లు చోరీ చేసిన ఖాతాలు ఏమయ్యాయనే విషయం తెలియరాలేదని.. హ్యాకింగ్ చాలా తీవ్రమైన సమస్యేనని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. ఇంకా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. ఒకరి ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇతరులకు ఎలా కనిపిస్తుందో చూపించే వ్యూ అజ్ ఫీచర్‌లోనే లోపం వుందని తెలిపారు. ప్రస్తుతానికి దీనిని నిలిపివేసినట్టు చెప్పారు. ఈ ఫీచర్‌ను వినియోగించిన 4 కోట్ల మంది ఖాతాదారుల యాక్సెస్ టోకెన్లను ముందు జాగ్రత్త చర్యగా ఫేస్‌బుక్ మార్చేసింది. కాగా, హ్యాకింగ్ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది. 
 
ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ఓ హ్యాకర్‌ బెదిరించాడు. గతంలోనూ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్ పేజీలో చిన్న మార్పు చేసి చూపించిన హ్యాకర్ మరోసారి ఆయనను టార్గెట్ చేశాడు. జుకర్‌బర్గ్‌కే ఓ హ్యాకర్ వార్నింగ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేసుకోకపోతే ఆ అకౌంట్‌ను హ్యాక్ చేసి లైవ్ ‌స్ట్రీమింగ్‌ పెట్టి చూపిస్తానని తైవాన్‌కు చెందిన హ్యాకర్‌ ఛాంగ్‌ చి యువన్‌ హెచ్చరించాడు. ఆ హ్యాకర్‌ ఫేస్‌బుక్‌ పేజీకి 26వేల మంది ఫాలోవర్లు ఉండగా, గత ఇంటర్వ్యూల ఆధారంగా హ్యాకర్ ఛాంగ్ వయసు 24 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.