Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీ తిన్న యువకుడు రక్తం కక్కుకుని మృతి

Written By సెల్వి
Updated: సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:34 IST)
ఓ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ తిన్న యువకుడు ఆ వెంటనే రక్తం కక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. చెన్నరావుపేట మండల పరిధిలోని బోడ తండా వాసి ప్రసాద్(23) ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తనకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తిన్నాడు.
 
అయితే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అతనికి వాంతులు వచ్చాయి. రక్తం కూడా నోట్లో నుంచి పడడంతో ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే ప్రసాద్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 
 
మున్సిపల్ అధికారులు రెస్టారెంటుకు చేరుకుని అక్కడి ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

అన్నీ చూడండి

అపుడు నటనకు పూర్తిగా స్వస్తి పలకాలని అనుకున్నాను : సమంత

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

తర్వాతి కథనం
Show comments