బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 మే 2022 (12:57 IST)

నాగార్జున సాగర్‌లో కేటీఆర్ పర్యటన..

ktramarao
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.  
 
ఇంకా ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు పాల్గొననున్నారు. వీరిలో స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి పాల్గొననున్నారు.
 
ప్రధానంగా హైదరాబాద్‌ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్‌ వెల్‌కు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.