సమతాస్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసం ఒక్కసారిగా రూ.50 పెంపు

మంగళవారం, 14 జూన్ 2022 (07:13 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించాలని భావించే పర్యాటకుల నుంచి నామమాత్రపు ప్రవేశ రుసుంను వసూలు చేస్తూ వచ్చారు. అయితే, ఇపుడు ఈ రుసుంను భారీగా పెంచేశారు. 
 
ప్రస్తుతం ఇక్కడ పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా వసూలు చేసేవారు. ఇపుడు దీన్ని రూ.200, రూ.125 చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సమతామూర్తి కేంద్రాన్ని తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఇస్తారు. బుధవారం సెలువు ప్రకటించడంతో ఆ రోజు మాత్రం అనుమతి లేదు. 
 
మరోవైపు, ఈ కేంద్రంలో ప్రధాన ఆకర్షణ అయిన డెనమిక్ వాటర్ ఫౌంటెయిన్ షోను ఇక నుంచి నాలుగుసార్లు ప్రదర్శించనున్నారు. లీలానీరాజనం పేరుతో నిర్వహించే ఈ వాటర్ ఫౌంట్ షోను మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 6, రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్నారు. 

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments