Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో అనేక బోర్డులున్నాయి.. ఇక పసుపు బోర్డు ఎందుకు?

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 16 మార్చి 2021 (10:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో అనేక బోర్డులు ఉన్నాయని, కొత్తగా పసుపు బోర్డు ఎందుకు అని కేంద్రం ప్రశ్నించింది. తనను గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఆ ఎన్నికల్లో బీజేపీ అభర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్ పదేపదే హామీ ఇచ్చారు. చివరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవితపై ఘన విజయం సాధించారు. 
 
ఇపుడు కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. కానీ, బీజేపీ ఎంపీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదుకదా.. హేళన చేసేలా మాట్లాడింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
 
నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారానికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.

అన్నీ చూడండి

Chiranjeevi : జి.వి. నారాయణరావు అంత్యక్రియలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments