Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ పరిధిలో 1540 పోస్టుల భర్తీకి పచ్చజెండా

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 21 మార్చి 2023 (17:47 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 1,540 పోస్టుల భర్తీ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఈ ఉత్తర్వులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో షేర్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడినందుకు హర్షం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని తెలిపారు. 
 
రిజ్వీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, హైదరాబాద్‌లో 323 పోస్టులను భర్తీ చేయనుండగా.. మేడ్చల్‌ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 మంది ఆశావర్కర్ల పోస్టులను భర్తీ చేస్తారని వివరించారు. ఈ భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా నియామక కమిటీల ద్వారా భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

Senior Naresh: 55 ఏళ్ల సినీ జర్నీ చేస్తున్న డా. నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ ఘన సత్కారం

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

తర్వాతి కథనం
Show comments