Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషన్ రెడ్డి , రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు.. ఏం తెలుసురా బిడ్డ నీకు..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (18:53 IST)
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెరాసా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి , రేవంత్ రెడ్డిలు చిల్లర గాళ్ళు అని మండిపడ్డారు.
 
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బ్లాక్ మెయిలర్ రేవంత్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ ఏం తెలుసురా బిడ్డ నీకు.. తెలంగాణ సాయుధ పోరాటం గురించి అంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నోటి తిట ఎక్కువ అయ్యింది.. తిట తీరుస్తామని హెచ్చరించారు . 
 
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగింది తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ ఘర్షణ సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి చురకలంటించారు. 
 
రేవంత్ రెడ్డే పెద్ద డ్రగ్ అడిక్ట్ అని అలాంటి వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఇక మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనకుండా బీజేపీనేత కిషన్ రెడ్డి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్నారు. రేవంత్ తన భాష మార్చుకోవాలని సూచించారు. భాష మార్చుకోకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకో మగడా అంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments