శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (21:39 IST)

పాలమూరు కుర్రాడి ప్రేమలో... పోర్చుగల్ అమ్మాయి..

కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు ప్రేమ అడ్డు కాదని నిరూపించింది ఓ ప్రేమ జంట. జడ్చర్లకు చెందిన మట్ట శ్రీపాల్‌(32) లండన్‌లో ఆడిటింగ్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడకు నాలుగేళ్ల క్రితం టూరిస్టుగా వచ్చిన పోర్చుగల్‌‌కు చెందిన వేర వెగాస్‌ లుకా వెలోజా

కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు ప్రేమ అడ్డు కాదని నిరూపించింది ఓ ప్రేమ జంట. జడ్చర్లకు చెందిన మట్ట శ్రీపాల్‌(32) లండన్‌లో ఆడిటింగ్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడకు నాలుగేళ్ల క్రితం టూరిస్టుగా వచ్చిన పోర్చుగల్‌‌కు చెందిన వేర వెగాస్‌ లుకా వెలోజా(34)తో ఆయనకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. 
 
ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సిద్ధపడ్డారు. జడ్చర్లలో రిజిస్ట్రార్‌ కార్యాలయం వీరి పెళ్లికి వేదికైంది. నెల క్రితమే రిజిస్టర్‌ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు వీరిద్దరూ. శ్రీపాల్‌ - వేర వెగాస్‌ లుకా వెలోజా జంటకు శుక్రవారం స్థానిక ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ఆంజనేయులు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. వెలోజా మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు నచ్చడంతో తాను కుటుంబ సభ్యులను ఒప్పించి శ్రీపాల్‌ను వివాహం చేసుకున్నట్లు తెలిపారు.