శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:48 IST)

డిగ్రీ విద్యార్థులకు షాకిచ్చిన తెలంగాణ సర్కారు.. ప్రమోట్ అయినా పరీక్షలు రాయాల్సిందే...

కరోనా నేపథ్యంలో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు రాయకున్నా.. తర్వాత క్లాసులకు ప్రమోట్ అయ్యారు. అయితే కోర్స్ ముగిసే లోపు ఆ పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీలు తాజాగా సర్క్యులర్ జారీ చేశాయి. దీంతో ప్రమోట్ అయిన డిగ్రీ విద్యార్థులు కోర్స్ ముగిసే లోపు ఆ పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.
 
యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు రాయకున్నా.. తర్వాత క్లాసులకు ప్రమోట్ అయ్యారు. అయితే కోర్స్ ముగిసే లోపు ఆ పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీలు తాజాగా సర్క్యులర్ జారీ చేశాయి.
 
డీటైన్ అయిన విద్యార్థులు కూడా.. బ్యాక్ లాగ్స్ రాయాల్సిందేనని సర్క్యులర్ ద్వారా స్పష్టం చేశాయి. ఈ నెల 30 లోపు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూనివర్సిటీలు తెలిపాయి. అలానే ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అక్టోబర్‌లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
అయితే సప్లిమెంటరీ నిర్వహించకుండా పాస్ చేయాలనే డిమాండ్ విద్యార్ధుల నుండి వస్తోంది. ఈ విషయం మీద ప్రభుత్వంతో మాట్లాడి యూజీసీకి లేఖ రాస్తామని ఉన్నత విద్యా మండలి తెలిపింది. యూజీసీ అనుమతి ఇవ్వకుంటే సప్లిమెంటరీ రాయాల్సిందేనని విద్యామండలి స్పష్టం చేసింది.