శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (11:49 IST)

జేఈఈ, నీట్ పరీక్షలు.. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం.. శివరాజ్ సింగ్ చౌహాన్

కరోనా వైరస్ నేపథ్యంలో నీట్ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. కోవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు అనేక నిరసనలు, భయాందోళనల నడుమ రేపటి నుంచి (సెప్టెంబర్ 1) మొదలవనున్నాయి. అలాగే సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వచ్చేనెల 13వ తేదీన జరుగనున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలైన జేఈఈ, నీట్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. బ్లాక్‌ లేదా జిల్లా కేంద్రాల నుంచి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను ఉచితంగా తీసుకువెళ్తామని తెలిపారు. అయితే విద్యార్థులు 181 నెంబర్‌లో లేదా వెబ్‌పోర్టల్‌లో సోమవారం సాయంత్రంలోగా రిజిస్టర్ చేసుకోవాలని సీఎం సూచించారు.
 
ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు ఇలాంటి ప్రకటనలే చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, వారికి అవసరమైన సహాయం అందించాలని వారి పార్టీ కార్యకర్తలకు సూచించారు. 
 
అదేవిధంగా విద్యార్థుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, వారికి కరోనా నిబంధనల ప్రకారం అన్నిరకాల చర్యలు తీసుకునే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.