Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్‌ను వెంటనే సస్పెండ్ చేయండి.. చంద్రబాబుకు ఎల్ రమణ లేఖ

తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ సీనియర్ నేతల మధ్యవిభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ డిమ

Written By pnr
Updated: బుధవారం, 25 అక్టోబరు 2017 (14:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని టీడీపీ సీనియర్ నేతల మధ్యవిభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ లేఖ రాశారు. 
 
గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారిన విషయం తెల్సిందే. ముఖ్యంగా గతవారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అదీ కూడా పార్టీ అధినేత చంద్రబాబుకు మాటమాత్రం చెప్పకుండా భేటీ అయ్యారు. 
 
దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో టీ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి వ్యవహారంపైనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ అంశాలన్నింటిపైనా ఓ నివేదిక తయారు చేసి రమణ పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. ఇందులో రేవంత్ వంటి నేత ఇక వద్దని, ఆయనపై వెంటనే వేటు వేయాలని కోరినట్టు తెలుస్తోంది. 
 
రేవంత్ పార్టీ మారడం ఖాయమని, ఈ లోగా సాధ్యమైనంత మేరకు టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని, కాబట్టి ముందే నిర్ణయం తీసుకుందామని కూడా రమణ సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌లో ఉన్న చంద్రబాబు, బుధవారం రాత్రి భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో రేవంత్‌పై నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments