Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ: మిర్చి రైతులను ఆదుకోండి

Written By సెల్వి
Updated: శుక్రవారం, 21 జనవరి 2022 (19:06 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మిర్చి  రైతులకు ఆ లేఖ ద్వారా మద్దతు పలికారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. 
 
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ తరపున రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని రేవంత్‌రెడ్డి లేఖలో వెల్లడించారు.
 
మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని ఆరోపించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments