మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా: భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్. తొలి బోనము సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు జోగిన స్వర్ణలత.
మీరు నా గుడిలో సరిగా పూజలు జరిపించడంలేదు. మీరెన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా. మీ కళ్లు తెరిపించడానికే ఆగ్రహంతో వర్షం కురుపిస్తున్నా. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. మీ సంతోషానికేగా పూజలు చేస్తున్నారు. నా గర్భాలయంలో మీరు శాస్త్రబద్ధంగా జరిపించండి. మొక్కుబడిగా చేస్తున్నా నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.
భక్తులందరికీ నా రూపాన్ని దర్శించుకునే స్థిరమైన ఆకారాన్ని ప్రతిష్టించండి. ఏడాది పొడవునా నా పూజలు ఘనంగా జరగాలి. నా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నా అని అమ్మవారు సెలవిచ్చారు.