ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:31 IST)

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 495 గ్రాముల బంగారం పట్టుబడింది. గురువారం దుబాయ్‌ నుంచి ఈకే 526 విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రయాణికుడిని తనిఖీ చేయగా బంగారం బయటపడింది.

అయితే బంగారాన్ని కరిగించి ఫేషియల్‌ క్రీమ్‌, శాండిల్స్‌, బ్లెండర్‌లో దాచి తీసుకెళ్తుండగా కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ.24 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బంగారాన్ని సీజ్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.