Daily Horoscope
✕

హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం, ఆరుగురు స్పాట్ డెడ్

Written By వి
Updated: మంగళవారం, 10 నవంబరు 2020 (14:43 IST)
హైదరాబాదు ఔటరింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. బోలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు రోడ్డుపై చెల్లాచెదరైపోయాయి. ఇందులో ముగ్గురు తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి గ్రామం వద్ద ఔటర్ రంగ్ రోడ్డుపై ఈ ఘోర ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
 
గుర్తు తెలియని వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన కొందరు బోలెరో వాహనంలో హైదరాబాదు నుంచి పటాన్‌చెరువు వైపు ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తున్నారు. వారి వాహనం పాటిగ్రామానికి చేరేసరికి వెనక నుండి అతి వేగంగా వచ్చిన మరో వాహనం బోలెరో వాహనాన్ని డీ కొట్టింది. దీంతో బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరణించిన ఆరుగురి మృత దేహాలను పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పటాన్ చెరువు ఇన్‌చార్జ్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్ పాటిగ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన బోలెరో వాహనంలో 9 మంది ప్రయాణిస్తుండగా ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
 
ముందు వెల్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ వాహనాన్ని డీకొన్న వాహనం కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతుల వివరాలకోసం ఆరా తీస్తున్నామని ఇన్‌చార్జ్ డిఎస్పీ తెలిపారు. 

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments