శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

మంగళవారం ఈ దీపారాధనతో వాహన ప్రమాదాలుండవట..?

ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులతో కష్టాలతో దిక్కుతోచని స్థితిలో వున్నప్పుడు కాపాడే దీపారాధన ఏంటో తెలుసుకుందాం. ముందుగా దుర్గాదేవి ప్రీత్యర్థం మంగళవారం నాడు ఎర్ర రంగులో వుండేవి దానంగా ఇవ్వాలి. ఇందులో చీర, జాకెట్ బిట్, గాజులు, పువ్వులు వుండవచ్చు. 
 
విపరీతమైన కష్టాలు ఏర్పడుతున్నప్పుడు దిక్కుతోచని స్థితిలో దుర్గాదేవి ఆలయంలో 14 రోజులు ప్రదోషంలో అమ్మవారి ఎదురు గుండా పసుపు రంగు గుడ్డమీద మేలిమి గంధం, పసుపు, కుంకుమ పొడి చల్లి దానిపై మట్టిప్రమిదలను వుంచి ఆవనూనెతో పోసి, ఒక వత్తి వేసి.. తూర్పు ముఖంగా చూసే విధంగా దీపారాధన చేయాలి. వాహన ప్రమాదాలు సంభవించవు. 
 
ఒకవేళ  వాహన ప్రమాదాలకు గురైన వారు 8 బుధవారాలు శివాలయంలో వుండే అర్చకుడికి స్వయంపాకం దానంగా ఇచ్చి, మట్టి ప్రమిదలో ఆవునేతిని పోసి.. దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.