శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

మంగళవారం హనుమంతునికి సింధూరం.. నాగవల్లి దళాలతో?

మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజలు చేయాలి. అలాగే ఎరుపు రంగు పూలతోనూ, ఎరుపు రంగు నైవేద్యం అంటే కేసరి లాంటిది నైవేద్యంగా సమర్పించిన స్వామివారి హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సకల పాప దోషాలు నుంచి విముక్తి కలుగుతుంది.
 
ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజించడం లేదా తమలపాకులతో అర్చన చేయడం ద్వారా సుఖ శాంతులు కలుగుతాయి. తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు. వీటితో స్వామివారిని పూజించడం ద్వారా నాగ దోషాలు కూడా తొలగిపోతాయి. తమలపాకు హారంతో పూజించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. 
 
మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని, హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుంది. మంగళవారం స్వామివారికి వడల హారం, తులసి హారాలతో పూజించడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.