Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ : కేసీఆర్ నిర్ణయం

Written By సెల్వి
Updated: బుధవారం, 3 ఆగస్టు 2022 (09:01 IST)
ఈ నెల 21వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సెషన్ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. 
 
ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా ఈ నెల 9 నుంచే పంపిణీ చేయాలని ఆదేశించారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు.
 
ఈ నెల 8న వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

అన్నీ చూడండి

Master Arun: సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

కన్నడలో యష్‌ తో చేయాల్సింది - బాబీ నన్ను ఎంకరేజ్ చేశారు : డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల

Teja Sajja: ది ట్రెయిటర్స్ గేమ్ మిస్టరీ గా ఉంటుంది, జాంబీ రెడ్డి 2 చిత్రీకరిస్తున్నాం తేజ సజ్జ

Vijay Deverakonda : రేపు విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ - 12న అనంతపూర్ లో ప్రీరిలీజ్

కొత్తగా వుందనే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ అవార్డ్ దక్కింది : డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె

తర్వాతి కథనం
Show comments