సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (17:17 IST)

తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టు షాక్

Koppula Eshwar
గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల రీకౌంటింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ఎన్నికలకు సంబంధించి తనపై దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈశ్వర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.
 
మొత్తం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏ.లక్ష్మణ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో తమను మోసం చేసి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) మెకానిజంను ఉపయోగించకుండా విజేతగా ప్రకటించారని పేర్కొన్నారు.