బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (12:39 IST)

తెలంగాణకు శుభదినాలే.. ఆదివారం మాత్రం మాంస భక్షణ చేయకూడదు..

ప్రగతి భవన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2. రాష

ప్రగతి భవన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2. రాష్ట్రం తప్పకుండా సుసంపన్నంగా ఉంటుంది. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటుందని సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సుఖ శాంతులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పండితులు చెప్పడం హర్షనీయమన్నారు.
 
ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి రాజ్యపూజ్యం 7, అవమానం 3 అని పంచాంగం చెప్తోందని తెలిపారు. ఈ ఏడాది సిరిసంపదలతో తెలంగాణ తులతూగుతుందని చెప్పినందుకు పంచాంగకర్తలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రధాని కూడా స్వయంగా అంగీకరించారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.50 వేల కోట్లకు పైగా ఇస్తుంటే, మనకు రూ. 24వేల కోట్లే వస్తోందని... అయినా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామనే సంతృప్తిలో వున్నట్లు కేసీఆర్ తెలిపారు.
 
అంతకుముందు ఉగాది వేడుకల సందర్భంగా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాగ శ్రవణం వినిపించారు. దిగ్విజయ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. బంగారు తెలంగాణ అతి త్వరలోనే సిద్ధిస్తుందని చెప్పారు. తెలంగాణ అవతరించిన నాటి రాశి, రాష్ట్ర పాలకుడి రాశి రెండూ ఒకటేనని అందుచేత ఏడాది శుభఫలితాలేనని తెలిపారు. 
 
ఇక దేశ వ్యాప్తంగా అక్టోబర్ నుంచి వర్షాలు కురుస్తాయి. డిసెంబర్‌లో వరదలు తప్పవని.. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని శాస్త్రి తెలిపారు. అయితే ఈ ఏడాది ఆదివారం నాడు ఎవరూ కూడా మాంస భక్షణ చేయకుండా ఉంటే అందరికీ మంచి జరుగుతుందని.. తాను చెప్పిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తులు లేవని.. గ్రహల ప్రకారమే పంచాగం చెప్పానని స్పష్టం చేశారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు.